26, ఆగస్టు 2010, గురువారం

మానసిక కాలుష్యం


మీరు తప్పించుకోలేరు, అవకాశమే లేదు తప్పించుకోవటానికి, కళ్ళు మూసుకున్నా, చెవుల్లో దూదులు పెట్టుకున్నా, ఏమి చేసినా తప్పించుకోలేరు ఈ కాలుష్యం నుండి. ఇది శబ్ద కాలుష్యం కాదు, రసాయన కాలుష్యం కాదు. అదే మానసిక కాలుష్యం. ఇదేదో ఫ్యాక్టరీలు కలిగిస్తున్నది కాదు. మరేవరో, ఇంకెవరో కలిగిస్తున్నది కాదు.

సమాజాన్ని ఉత్తేజితులను చేసి, సమాజంలో ఉండే తప్పుడు భావాలను, అపనమ్మకాలను వమ్ముచేసి విద్యావంతులను ( ! ! ) చేయటానికి కంకణం కట్టుకుని, ప్రజా స్వామ్యానికి నాలుగో స్తంభంగా తమకు తామే పేరు పెట్టుకున్న, ఘనతవహించిన మీడియా. అవి పత్రికలు కావచ్చు, రేడియో కావచ్చు, ఒక బ్రహ్మాండ పిశాచం లాగ తయారయ్యిన టి.వి కావచ్చు. వాళ్ళందరూ కలిగించేదే మానసిక కాలుష్యం. ఇదొక కాలుష్యం అని తెలియకుండా, చక్కగా పంచదార పూత పూసి, ధారావాహికలని, వార్తలని, మరింకేదో అని మనం తప్పించుకోవటానికి వీల్లేకుండా నిద్ర లేచిన తరుణం నుండి, పడుకునే వరకు (నిద్రలో కూడ మనకు కలల్లో అవ్వే వచ్చేట్టుగా) మనని పట్టి పీడిస్తున్నది ఈ మీడియా వెనుక ఉన్న అడ్వర్టైసుమెంటు మాఫియా, అవును మాఫియానే.

ఇంట్లోంచి బయటకు రాగానే ఎదురుగుండా ప్రత్యక్షం ఒక పెద్ద హోర్డింగు, దానిమీద ఏవేవో వెర్రి మాటాలతో ప్రకటనలు. ఏమని, అదేదో ఒక వస్తువో లేక సెల్ కనెక్షనో తీసుకోమని తిరకాసు మాటలతో అర్ధింపు లాంటి ఆజ్ఞ. మనం చిన్నప్పుడు బ్రాహ్మడు మేక కథ చదివే ఉంటాము. అందులో మేకను పట్టికెళ్తున్న బ్రాహ్మడిని మోసం చేసి ఆ మేకను కొట్టేయటానికి కొందరు పథకం ప్రకారం, అతను తీసుకెళ్తున్నది మేక కాదని, కుక్క అని పదే పదే విడి విడిగా చెప్తారు. పాపం ఆ అమాయకుడు అన్ని సార్లు రకరకాలుగా చెప్పేప్పటికి, తన కళ్ళు కూడ తనను మోసం చేస్తున్నాయని ఒక నిర్ణయానికొచ్చేటుగా చేసి ఆ మేకను కాస్తా కాజేస్తారు ఆ దుష్టులు. ఆ తరువాత ఆ మేకను ఏం చేసి ఉంటారో తెలుసుకోవటానికి పెద్ద జ్ఞానం అక్కర్లేదు.
అదే పధ్ధతి, ఈ ప్రకటనల ఉద్దేశ్యం కూడ. ఒక్కసారి కాదు అనేకసార్లు, వేల సార్లు, అనేక చోట్ల, ఇక్కడ అక్కడ అనిలేదు, రోడ్లమీద హోర్డింగులు, రోడ్డు డివిడర్లు, బస్సుల మీద, రైళ్ళ పెట్టెల మీద, పత్రికలు, రేడియోలు, సరే టి.విలు, ఏదైన టిక్కెట్టు కొంటే దాని వెనకాల, ఏటిఎం లో డబ్బులు తీసుకున్న తరువాత వచ్చే చీటి వెనుకాల, ఎందెందు వెతికిన అదెందు కలదు ఈ కాలుష్యం. చివరకు ఎంత బరితెగించి పొయ్యారంటే ఈ కాలుష్య కర్తలు, కుర్రాళ్ళ భుజాలకు ఈ ప్రకటనలు కట్టి రోడ్ల మీద ఎండలో వరుసగా నిలుచో పెడుతున్నారు . ఇలా కుర్రాళ్ళను ఎండలో నిలబెట్టటాన్ని ఇంతవరకూ ఏ సామాజిక కార్యకర్త (?) విమర్శించలేదు.
ఎందుకు ఇంత ప్రకటనల పిచ్చి. ఎలాగో ఒకలాగ తమ వస్తువలను, సేవలను అమ్ముకోవాలి. అమ్ముకోకపోతే సంస్థ నిలవదు. తాము తయారు చేసే వస్తువులను అమ్ముకోవటానికి, ఆ వస్తువలు నాణ్యతే అతి ముఖ్యమైన వ్యాపార ప్రకటన అని మర్చిపోతున్నారు. ఒక తృప్తి చెందిన వినియోగదారుడే ఆ వస్తువుకు అద్భుతమైన ప్రచారాన్ని కలుగ చేస్తాడు. ఇటువంటి అరోగ్యకరమైన ధోరణి ఇప్పుడు లేదు. ఎలాగో ఒక లాగ తమ వస్తువులను మనకు చుట్టబెట్టి అమ్మేసుకోవలి. నాణ్యత ఉంటే ఉండచ్చు, లేకపోతే లేదు, అది మన అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఆ వస్తువు అవసరం మనకు ఉన్నదా లేదా అని మన నిర్ణయాన్ని వాళ్ళే చేసేస్తారు, మనను ఆలోచించుకునే అవకాశం వెసులుబాటు లేకుండా తమ ప్రకటనా (కాలుష్య) పాటవంతో మనను ఉక్కిరి బిక్కిరి చేసేసి, మనం ఒక హిప్నొటిక్ ట్రాన్స్‌లోకి వెళ్ళిపోయేట్టు చేసి తమ వస్తువును తాము నిర్ణయించిన వెలతో (అందులో లాభ శాతం చాలా సార్లు 100% కంటే ఎక్కువగా ఉంటుంది) మన చేత కొనిపించేస్తారు.
ఆర్ధిక శాస్త్రంలో మానవుడి అవసరాలను మూడు విధాలుగా విభజించబడినాయి. అవి మనిషి ఆర్ధిక స్థాయినిబట్టి అవి అటు ఇటు మారుతుంటాయిట! అవేమిటంటే నిత్యావసరాలు, సౌకర్యాలు, విలాసాలు. అని. మనం కొంత నిదానించి చూస్తే, వీటిల్లో ఈ వ్యాపార ప్రకటనలు ఏ విధమైన ఉత్పత్తులకు/సేవలకు వస్తున్నాయి? నిత్యావసరాలైన బియ్యం, కూరలు వంటివాటికి వ్యాపార ప్రకటనలు రావట్లేదు. ఎందుకంటే అవి పండించే రైతులకు ఇటువంటి అనారోగ్యకరమైన ఆలోచనలు లేవు. పైగా అవి నిత్యావసరాలు కనుక వాటికి గిరాకి ఎక్కువ, మార్కెట్టులోకి వచ్చిన వెంటవెంటనే అమ్ముడుపోతాయి.

అదేదో వ్యాపార వ్యవసాయంట, పెద్ద పెద్ద కంపెనీలు ఇప్పుడిప్పుడే తమ విషపు చూపులను వ్యవసాయం వైపుకు సారిస్తున్నాయి. వాళ్ళ ఆలోచనలు విజయవంతమైతే, కొద్దిరోజులలో మనకు బ్రాండెడు వంకాయలు, ఏనుగు మార్కు బంగాళ దుంపలు కొనండి అంటూ దేశంలో గుడ్డల కరువేమో అనిపించేట్టుగా కనిపించే ఓ పిల్ల గెంతుతూ మీ చెవిలో చెప్తుంది. ఆ పిల్లను చూసిన పరవశంలో ఆ బంగాళ దుంపలు కొనెయ్యటానికి ఎగపడతారు జనం. ఇక వ్యాపార ప్రకటనలన్ని కూడ సౌకర్యాలు విలాసాల చుట్టూ తిరుగుతున్నాయి. షాంపూలు, పేస్టులు, సానిటరీ నేప్కిన్‌లు, రేజర్లు/బ్లేడులు, కార్లు/ద్విచక్ర వాహనాలు, రెప్రిజిరేటర్లు, వాక్యూం క్లీనర్లు మొదలగుగా గల అనేకానేక వస్తువులు.

మనం సమాజంలో అందరం కలసి బతకటం నేర్చుకుని చాలా శతాబ్దాలయ్యింది. ఎవరికి చాతనైన పని వారు చేసుకుంటూ, ఇతరులకు తమ వస్తువులను, సేవలను అందిస్తూ బతకటం అనేది విజయవంతంగా జరుగుతున్నది. అందరూ ఎంతో కొంత ఇతరులకు "పనికి వచ్చే" పని (ECONOMIC ACTIVITY) చెయ్యాలి. మనం చేసేపనికి ఇతరులకి ఉపయోగ పడాలి.

ఉత్పత్తి దారునికి, వినియోగదారునికి మధ్య దళారులు ఎక్కువైన కొద్ది ఆ వస్తువు ధర పెరుగుతుంది. ఉత్పత్తి దారునికి, వినియోగదారునికి మధ్య ఆ వస్తువులను ఉత్పత్తి జరిగిన చోటినుండి, వినియోగ దారుని దగ్గరకు తెచ్చి అమ్మటానికి ఒక వ్యవస్థ కావాలి. వారు చేసే పనిలో ఉత్పాదకత వస్తువును ఒక చోటినుండి మరొక చోటికి చేరవేయటమే (PLACE VALUE). ఈ సేవ ఎంతయినా అవసరం.

వ్యాపార ప్రకటనలు ఒక వస్తువు గుణగణాలను వినియోగదారునికి తెలియచెప్పటానికి పనికి వస్తాయి. అ వ్యాపార ప్రకటనలు తగిన మోతాదులో ఉండాలి. మోతాదు మించిన వ్యాపార ప్రకటనల వల్ల వినియోగదారునికి ప్రయోజనం సున్న. పైగా ఈ అనవసర వ్యయం వల్ల, ఉత్పాదకదారు తన వస్తువు ధర పెంచుతాడు. మనం కొనే ప్రతి వస్తువు ధరలోనూ, మనకు రోజూ చూసే హోర్డింగు ధర, వినే టంగు టింగంటూ వినపడే రేడియో ప్రకటన, వార్తా పత్రికలో మొదటిపేజీలో కూడా సగాన్ని మించిన ప్రకటన ధర (కొన్ని పత్రికలు సిగ్గు విడిచి, తమ పత్రిక పేరు పైన కూడ ప్రకటనలను అనుమతిస్తున్నాయి). అనుక్షణం అన్ని ఇళ్ళల్లోనూ మోగే టి.వి. ప్రకటనల ధర నిబిడీకృతమై ఉంటుంది.
వ్యాపార ప్రకటనల ధోరణి చాలా అనారోగ్యకరమైన పంధాలో పడింది. ఏ వస్తువు గురించైనా ఒక పధ్ధతిలో అరోగ్య కరమైన ప్రకటనలు వినియోగదారునికి ఎంతైనా పనికి వస్తాయి. కాని, అవి ఆడుగడుగునా మనల్ని వెంటాడి వెంటాడి తరుమటం వల్ల మనకు తెలియకుండా మన అలోచనా పధ్ధతిని ప్రభావితం చేస్తున్నాయి. ఒక ప్రకటనలో మంచి ధృఢకాయుడైన అందమైన యువకుణ్ణి చూసి పెళ్ళైన ఒక యువతి తన మంగళసూత్రం కనపడకుండా కప్పుకుంటుంది. మరొక ప్రకటనలో ఒకావిడ పూవు కోసే ప్రయత్నంలో ఉంటే ఆవిడ పల్లు గాలికి ఎగిరిపోతుంది, ఆవిడ పరిగెడ్తుంతే ఆవిడ అందాన్ని (ఫోనులో తరువాత మాట్టాడతాలే అని కసిరి మరి) తదేకంగా చూస్తుంటాడు ఒక యువకుడు. ఇక సానిటరీ నాప్కిన్‌ల ప్రకటనల తీరు చెప్ప వీల్లేదు. ఇలా ఒకటని లేదు. అన్ని వ్యాపార ప్రకటనలు అర్ధం పర్ధం లేకుండా ఒక్కటే సూత్రం, తరచి తరచి, మళ్ళి మళ్ళి చూపిస్తూ ఉండి మనకు మానసిక కాలుష్యాన్ని స్లో పాయిజన్ లాగ అందిస్తూ తమ పబ్బం గడుపుకుంటున్నాయి. ఈ వ్యాపర ప్రకటనల తీరు ఎంతవరకు వెళ్ళిందంటే, ఆయా చానెళ్ళ వార్తా ప్రసార ధోరణి, కార్యక్రమాల సరళి, కార్యక్రమాలలో ఉండాల్సిన విషయ విశేషాలను శాసించే విధంగా ఉన్నది. ఏ చానెల్ కు ఎక్కువ రేటింగు ఉంటే ఆ చానెల్ కు అంత ఎక్కువ వ్యాపార ప్రకటన రాబడి వస్తుంది. ఈ రేటింగు కోసం, అన్ని చానెళ్ళు (కొంచెం ఎక్కువ తక్కువ అంతే) తిక్క తిక్క కార్యక్రమాలు, ఇది చూపవచ్చు, ఇది చూపకూడదు అన్న ఇంగితం కూడ లేకుండా తమ వార్తా ప్రసారాలను, ఇతర కార్యక్రమాలను మనమీద వదులుతున్నారు.
నగరాలలో ఎక్కడ చూసినా హోర్డింగులే. పైగా ఆ హోర్డింగులకు రాత్రిపూట లైట్లు!! మనకు తిండి పండించే రైతుకు కరెంటు కట్ పెట్టి మరీ నగరాల్లో ఉన్న ఈ హోర్డింగులకు లైట్లు ఇవ్వాలా. చిత్రమైన విషయం!
ఈ కాలుష్యాన్ని తగ్గించే ఉపాయమే లేదా. ఇటువంటి మానసిక కాలుష్యాన్ని గుర్తించి నియంత్రించే నాదుడే లేడా. ఏమి చెయ్యాలి. మనం కొనే వస్తువులలో ఈ అనవసర వ్యయం ఎంత? మనకు తెలియనివ్వకుండా ఒక ధారావాహిక స్పాన్సర్ చేస్తారు. ఆ ధారావాహిక రోజూ చూడాలనిపించి అనేక నెలలు సాగతీయబడుతుంది. మనం చూస్తూనే ఉంటాము, కొనే వస్తువు ధర పెరుగుతూనే ఉంటుంది.
చాలామందికి అత్యల్పంగా కనిపించే, ఈ ముఖ్యమైన విషయం గురించి కొంత చర్చ AP మీడియా కబుర్లు బ్లాగ్‌లో కొంతవరకు జరిగింది. ప్రకటనల దాడి నుంచి సమాజాన్ని రక్షించే ప్రయత్నం ఎవరు చెయ్యాలి. మీడియా తనంతట తాను ఈ పని చేస్తుందా? చెయ్యదు!! ఎందుకు అంటే, వాళ్ళకు ఇదొక ఆదాయ మార్గం. తమకొచ్చే ఆదాయాన్ని వదుకుంటారా! లేనే లేదు. ఇక మిగిలినది ప్రభుత్వం. ప్రభుత్వాధికార్లకు ఉన్న నిజాయితీ మీద ప్రజలకు నమ్మకం పోయి కొన్ని దశాబ్దాలయ్యింది. మరింకెవరు రక్షిస్తారు మన్ని ఈ కాలుష్యం బారినుండి??
ఎలెక్షన్ కమిషన్ తరహాలో ఒక స్వతంత్రమైన వ్యవస్థను ఏర్పరిచి, అటువంటి వ్యవస్థ ఈ ప్రకటనల తీరుతెన్నులను పరిశీలించి, కొన్ని కఠినమైన నియమాలను (GUIDELINES) తయారు చేసి ఏవిధమైన తిరకాసు, తికమక లేకుండా అమలు పరచాలి. ఈ నియమాలను తయారు చేయ్యటానికి, సమాజంలోని పెద్దలను, వినియోగదారుల సంఘాల సేవలను ఉపయోగించుకోవాలి.
నా ఉద్దేశ్యంలో వ్యాపార ప్రకటనల నియంత్రణకు తయారు చేయాల్సిన నియమాలు ఈ విధంగా ఉండాలి:

  1. ఒక వస్తువు ధరలో, వ్యాపార ప్రకటన ఖర్చు, ఎంత శాతాన్ని మించకుండా ఉండాలి.
  2. ఏ వస్తువులకు వ్యాపార ప్రకటన చెయ్యకూడదు.
  3. ఏక్కడెక్కడ వ్యాపార ప్రకటనలు చెయ్యకూడదు. హోర్డింగుల మీద, రోడ్ డివైడర్ల మీద , రైళ్ళు, బస్సుల మీద ప్రకటనలను, గుడి/పాఠశాల గోడల మీద పూర్తిగా నిషేధించాలి.
  4. టివిలో వచ్చే కార్యక్రమాలలో ఎంతవరకు వ్యాపార ప్రకటనలు ఉండవచ్చు. అంటే అసలు కార్యక్రమానికి, వ్యాపార ప్రకటనకు మధ్య ఉండే నిష్పత్తి. అరగంట అసలు కార్యక్రమంలో, అరనిమిషానికి మించి ప్రకటనలు ఉండకూడదు.
  5. ప్రకటనను ఎన్ని సార్లు ప్రచురించవచ్చు, ఎన్నిసార్లు వినిపించవచ్చు లేదా చూపించవచ్చు. తరచి తరచి చూపించటం వల్ల మనకు తెలియకుండానే ఆ వస్తువు పేరు గుర్తుండిపోయి, మరొక సరైన వస్తువు వెతుక్కునే హక్కును కోల్పోతున్నాము,
  6. ఒక ప్రకటన మళ్ళి ఎంత సమయం తరువాత అదే ప్రకటనను చూపించవచ్చు/వినిపించవచ్చు/ప్రకటించవచ్చు. పేపర్లో ఐతే వారం వ్యవధిలో పున:ప్రచురణ ఉండకూడదు. టి వి రేడియోల్లో మళ్ళి నాలుగు గంటల వరకు చూపించకూడదు./వినిపించకూడదు.
  7. టి.విల్లో వచ్చే ధారావాహికల ఎపిసోడ్ లు ఎన్ని ఉండవచ్చు
  8. టి.విల్లో వ్యాపార ప్రకటనలకు వెచ్చించే సమయంలో తప్పని సరిగా 25% శాతం సామాజిక ఉన్నతికోసం ప్రకటనలను చూపించాలి. పౌర విజ్ఞానం, సాంఘిక దురాచారాలు, తాగుడువల్ల కలిగే నష్టాలు మున్నగునవి
  9. ఏ వస్తువులకైతే ప్రకటనలను నిషేధించారో (సిగిరెట్లు, ఆల్కహాల్) అటువంటి ఉత్పత్తిదారులు తయారుచేసే (అదే బ్రాండు పేరుతో) మరే ఇతర వస్తువులకు ప్రకటనలు చెయ్యరాదు. బ్రాండు పేరుతో కనపడకుండా, నిషేధిత వస్తువు పేరు గుర్తుకు తెస్తున్నారు.
  10. సిగరేట్/ఆల్కహాల్ తయారీదార్లు ఏ విధమైన స్పాన్సరింగు చెయ్యకుండా కట్టడి చెయ్యాలి.

ఈ విధంగా కొంతవరకూ నియమాలను చేసుకుని ఈ వ్యాపార ప్రకటనా కాలుష్యాన్ని కొంతలో కొంతవరకూ నియంత్రించవచ్చు అని నా అభిప్రాయం.













.

13 కామెంట్‌లు:

  1. >>ఆ వస్తువలు నాణ్యతే అతి ముఖ్యమైన వ్యాపార ప్రకటన అని మర్చిపోతున్నారు.

    100% శాతం అంగీకరిస్తాను. నాణ్యత పాటిస్తే తద్వారా వచ్చే మౌత్ పబ్లిసిటీ కన్నా మెరుగైన ప్రకటన లేదు.

    రిప్లయితొలగించండి
  2. బాగా చెప్పారు శివ గారూ!
    ప్రభుత్వ నియంత్రణ అంటేనే అదో తేనెతుట్టెను కదిపినట్లవుతుంది కనుక 'ఆంబుడ్స్‌మన్ ' వంటి వ్యవస్త అవసరమని నేను రామూ గారి బ్లాగు లో చెప్పాను. బ్యంకింగ్ 'ఆంబుడ్స్‌మన్ ' లాగానే మీడియాలోని తటస్త పెద్దల చేత మీడియా వారే ఏర్పాటు చేసుకొనేలా ప్రభుత్వం/ కోర్ట్ వారు గానీ విధివిధానాలను నిర్దేశించవచ్చు లేదా ఎలెక్ట్రిసిటీ రెగ్యులటరీ కమీషన్ లాగా మీడియా యాడ్స్ రెగ్యులటరీ కమీషన్ ఏర్పాటుచేయవచ్చు.

    రిప్లయితొలగించండి
  3. MS PAVANI MADE THE FOLLOWING COMMENTS IN AP MEDIA KABURLU BLOG where discussion on this subject raged for some time:

    "Siva gaaru,
    I read your blog. It was very passionate to say the leaset. Of the 10 regulations you proposed..
    A) Laws for 2 and 3 are there and can be expanded.
    B)9 and 10 must have been there too and my guess is business is outsmarting the govt.
    C)No.8 is nice to have to certain extent.25% is substantial though.
    D)1,4,5,6,7---neither possible nor advisable.This leads to buraeucracy,red tapism , more corruption, monopoly.etc..Mighty will win as usual. The biggest looser will be the consumer, contrary to your primary goal. Thanks."

    రిప్లయితొలగించండి
  4. Pavani garu. Thanks for your reaction. You are telling that my following suggestions are neither possible nor advisable

    1. ఒక వస్తువు ధరలో, వ్యాపార ప్రకటన ఖర్చు, ఎంత శాతాన్ని మించకుండా ఉండాలి.
    4. టివిలో వచ్చే కార్యక్రమాలలో ఎంతవరకు వ్యాపార ప్రకటనలు ఉండవచ్చు. అంటే అసలు కార్యక్రమానికి, వ్యాపార ప్రకటనకు మధ్య ఉండే నిష్పత్తి. అరగంట అసలు కార్యక్రమంలో, అరనిమిషానికి మించి ప్రకటనలు ఉండకూడదు.
    5. ప్రకటనను ఎన్ని సార్లు ప్రచురించవచ్చు, ఎన్నిసార్లు వినిపించవచ్చు లేదా చూపించవచ్చు. తరచి తరచి చూపించటం వల్ల మనకు తెలియకుండానే ఆ వస్తువు పేరు గుర్తుండిపోయి, మరొక సరైన వస్తువు వెతుక్కునే హక్కును కోల్పోతున్నాము,
    6. ఒక ప్రకటన మళ్ళి ఎంత సమయం తరువాత అదే ప్రకటనను చూపించవచ్చు/వినిపించవచ్చు/ప్రకటించవచ్చు. పేపర్లో ఐతే వారం వ్యవధిలో పున:ప్రచురణ ఉండకూడదు. టి వి రేడియోల్లో మళ్ళి నాలుగు గంటల వరకు చూపించకూడదు./వినిపించకూడదు.
    7. టి.విల్లో వచ్చే ధారావాహికల ఎపిసోడ్ లు ఎన్ని ఉండవచ్చు

    How these are not possible? Government can definitely can come out with a restriction to limit the cost of advertisements being included in the price of any product and it can be monitored.

    Now a days, the level of advertisements in TV programmes has grown to ridiculous level where the viewer is forgetting what he is seeing, the programme or the advertisements? The proportion between the content and advertisements can be monitored so that the consumer does not get brainwashed with continuous dinning of advertisements, lured by some programme which is shown for short period.

    Then repetition of ads is the present day malady and the mischievous strategy of the ad agencies, because of which ads are becoming psychological pollution. The Govt. Agency should continuously monitor and pull up such channels showing the same ad beyond the level prescribed.

    For a long time Doordarshan has controlled the number of episodes upto 13 and extended them only under popular demand. This has resulted in excellent serials like Nukkad etc. which have brought out the latent talent of the Writers, Directors and Actors. Present day serials going on and on are only a curse on the Actors and Writers as they are forced to do some unnatural episodes robbing their talent from them.

    Finally, unless we feel passionate about the evils that are plaguing the society, we cannot come out with solutions. If we are casual about such evils, we only end up as victims of these ad agencies' plots to continue to make us their slaves.

    Finally, Government is a great machinery modern man invented. Just because, in our country we do not know how to elect a proper Government does not make the institution not worthwhile. People who do not vote in elections have no right to criticize Governments and Politicians, as they have failed in their primary duty.

    రిప్లయితొలగించండి
  5. 1. Cost of a product is a complicated science. What you see on the pack hardly gives any clue. Forget about govt., even experts will have tough time determining the cost of a product accurately.

    4. Here govt. devising the mktg. strategy. There is no bigger joke than this.

    5. You are questioning the fundamental idea behind advertising.Seller always wants his product retained in the minds of the consumer. Thats how he makes money. He invsests, takes risk, compete in the market and finally let mkt forces decide the fate.
    6.Read 4.
    7. hmmm...what can I say, Sir.!

    రిప్లయితొలగించండి
  6. Pavani.

    What is appearing as a joke to you is the real problem. In a programme of half an hour, ads are occupying majority of time. If this is not regulated how can this ad menace be got rid of!!!

    Every manufacturer wants to somehow reduce the cost of his manufacturing. So why don't you do away with the anti pollution measures?? Like Air Pollution, Sound Pollution, advertisements are also another type of pollution and this is psychological pollution, which people are yet to realise.

    Stop being skeptical and stop ridiculing the ideas of people who are able to forecast things. I only advise you to try to think and then react. Do not react with some vested interest.

    What I want people to do is to understand the menace of advertisements are causing to the human psyche. Ultimately, apparently educated people are also not able to realise the danger of advertisements. What a pity.

    రిప్లయితొలగించండి
  7. @Pavani

    Costing is not that difficult and there is an Institute of Cost and Works Accountants in India and across the world also. These specilist people can pin point the cost of production of any item manufactured. So do not try to venture into what you do not know. Leave it to the experts. Just because you do not know, it is not a universal fact that none else would know.

    రిప్లయితొలగించండి
  8. Siva gaaru,

    You don't know me. It is unfair to attach motives to what I said. While both of us kind of agree on curbing the problem of ad pollution, I clearly differ with your ideas.

    Cost accounting is an expert field. You said the same too.Not sure where you think I differ.

    Marketing startegy for any company is very dynamic and highly creative. Inertia and monotony(standardization) are the hall marks of govt. How these two can be linked? Sorry..I didn't get it.

    No two programs are same. One can be highly successfull other need not.How can govt. decide on how many episodes each should run?

    Your other ideas(when, where, how frequent etc..) are not practicable either.
    A prime time progam is different from a prime time program that is popular which is different from a prime time program that is meant for kids which is different from a prime time program targeted at females...do you know how many combinations one would get.?

    You think Govt. for that matter anybody dictate how business be allocated time for each of those. What all it can do is..like you suggested..lets give half minute to any program.

    I share your concern but not many of these ideas. Your ideas are original and honest but innocent.

    Above all, your faith in Govt. functioning is amazing!

    Narayana murthy must be wrong in your view when he said.."...the trmendous growth in IT is not because of govt., but inspite of it".

    I expect you to publish this. Regards.

    రిప్లయితొలగించండి
  9. @Pavani

    I am also amazed at your unshakable faith in the so called market forces regulating every thing on their own. In the days of Adam Smith, may be the market forces were OK. But now the market forces are not the consumers and manufacturers. The Ad agencies aided and abetted by the Media are trying to tinker with the market forces and unfortunately they are becoming successful also and hence present day market forces are heavily induced by the manufacturer but not a natural demand from the consumer depending upon his need and necssity.

    Please do not misquote/quote out of context great man like Narayana Murthy. It is the same Government which you do not seem to like, that brought all the liberal reforms paving way for the growth of institutions like Infosys. It is the same Government which consists great institutions like Reserve Bank, Indian Railways, Postal Service etc. Do not come to drastic conclusions with your limited experience with some low level Officials in some obscure departments.

    If anybody is trying to equate Politicians and Government they have not understood the institution at all. Politicians are only the ugly face of the democracy, for which we (all the citizens) are responsible.

    OK coming to the point. How much time an ad should be given in the original programme content is the major issue. You are unable to understand that important point. Just watch TV for half an hour without changing channel.

    You can see, even educational institutions coming out with ads just similar to beggars begging for alms to make students to join them, which is to say the least quite nauseating. A new development is, firms selling material for religious activities are also coming out with ads. If we see those ads, we lose interest in performing pooja with all those artificial dadiwals trying to preach religion to us.

    Imagine the effect of high dose of advertisements repeated relentlessly on the minds of children while they are trying to watch a programme of cartoons or similar programme. There is every need to maintain a healthy ratio between the programme content and the advertisement time. That can be properly discussed (not just your ideas or my ideas)and a guideline can be brought out for implementation.

    With a Marketing strategy good or bad, a manufacturer has to sell his product by healthy practice but not by brainwashing the public with his onslaught of incessant advertisements in all forms be it hoarding, hand bill in news paper,TV/Radio Ad or full page ads in papers and magazines.

    Atleast for the sake of aesthetic look of our environment and safety of people on the roads, the hoardings have to be completely banned or severely curtailed. Do you see the sprouting of uncontrolled hoardings in any European or American City. They have grown out of it. They have some sane minds in their society to see the evil effects of all these and did understand the need for regulation.

    For any reform, there should be some beginning. As a society, we should realise the menace of the advertisement industry which is creating visual, audio and more dangerously psychological pollution. Every one of us is a victim of it. Ignoring this pollution and trying to justify the uncontrolled and unregulated advertisements is very dangerous for the society. Simply saying that there is no need to regulate the advertisements is just surprising.

    రిప్లయితొలగించండి
  10. I stand by my comment that in the cost of production of any article, the cost of advertisement should not occupy more than a tiny percentage. This percentage can be decided depending upon the the profile of the manufacturer. A manufacturer who has been in the field more time should be curtailed to limit his advertisements while a relatively new comer can be given a little bit more leverage.

    My point is that the nature of such regulatory features can be decided depending upon each industry and need not strait jacket the issue.These things can be decided after thorough discussion. If we say it is not possible in the beginning itself, how a reform shall start.

    Ultimately, the point is the unproductive cost of Advertisements should not be a major component in the cost of production of any product or service.

    I hope I have made myself clear once again.

    Nobel Prize winner Amartya Sen did not put the title of his book as "Argumentative Indian" for nothing.

    రిప్లయితొలగించండి
  11. You mentioned 10 ways to conrol ad pollution. All are govt. controls.. I have a problem with 5 of those. I mentioned whith numbers which 5. Instead of specific to each of them, you are going all over. Did I say too many ads are good? Did I say hoarding blocking roads are good?Did I say govt. should not involve at all(I agree with half of your suggestions).What is the point in stressing on stuff that I didn't question at all.
    You suggested govt. should decide how many episodes each program run..I said that is not possible because each program is different by genre, success, time etc.
    You said ad spend should not be more than certain percentage of product cost. I said it is not easy to to figure that out. let me add..even if it is easy govt. has more important things to do than to monitor cost and ad spend of thousands of ads in 100s of channels every sec..
    You said ad frequency be controlled by govt..I beleive it is impossible to monitor.
    I didn't misquote Narayana Murthy. As a patrotic citizen he has faith in govt. Yet he realizes its limitations.

    I observed that not only you there are couple of more bloggers here who are very passionate about what they believe in. Such conviction is fine. The problem is often times they(including you) do not realize, others(like me) are actually agreeing with you on certain aspects but have different opinions on some others.In this specific case, much of your execution plan is impracticable. But the spirit behind it is laudable. You are rigorousely defending the spirit which you need not. Because that is not the confrontation point.
    Finally how about if I say "Don't quote/misquote Amartya Sen".

    On a side note: I live few miles away from where Mark Twain lived and worked on most of his famous books.It was so coincidental that the books and authors that you like matches to the T with my taste.

    రిప్లయితొలగించండి
  12. @పావని. ముదుగా మీ చివరి వ్యాఖ్యకు స్పందన. మీకు కూడ మార్క్ ట్వైన్ అంటే అభిమానం పైగా మీరు ఆ మంచి రచయిత నివసించిన ప్రదేశానికి దగ్గరే అన్న విషయాలు సంతోషం కలిగించాయి. ఆ మహానుభావుడు నివసించి రచనలు చేసిన ప్రదేశాలు ఫొటోలతో మీరొక వ్యాసం వ్రాయగలరా. వ్రాసి మీ బ్లాగులో ప్రచురించండి. లేదా, నా బ్లాగులోనే "గెస్టు కాలం" కింద ప్రచురిస్తాను. ఒక మంచి రచయిత గురించి వ్రాసి, ఆ రచయిత అభిమానులకు తెలియచేయగలరు.

    రిప్లయితొలగించండి
  13. @ పావని
    నేను నా వ్యాసంలో నా ప్రతిపాదనలకు ముందుగా ఈ కింది విధంగా స్పుటంగా వ్రాశాను.

    "ఎలెక్షన్ కమిషన్ తరహాలో ఒక స్వతంత్రమైన వ్యవస్థను ఏర్పరిచి, అటువంటి వ్యవస్థ ఈ ప్రకటనల తీరుతెన్నులను పరిశీలించి, కొన్ని కఠినమైన నియమాలను (Guidelines) తయారు చేసి ఏవిధమైన తిరకాసు, తికమక లేకుండా అమలు పరచాలి. ఈ నియమాలను తయారు చేయ్యటానికి, సమాజంలోని పెద్దలను, వినియోగదారుల సంఘాల సేవలను ఉపయోగించుకోవాలి".

    ఎలెక్షన్ కమిషన్ లాంటి వ్యవస్థను ఏర్పరిచి (మనకు తెలియకుండా మనం కొనే ప్రతి వస్తువు ధరలో కలిసిపోయి ఉన్న సేల్స్ టాక్సులో ఒక సహస్రాంశం బడ్జెట్ కింద ఇస్తే చాలు) నేను చెప్పిన ప్రతిపాదనలను, అన్ని చానెళ్ళనూ మోనిటరింగు చేస్తూ, ఏ ప్రకటన ఎన్నిసార్లు వస్తున్నది, ప్రకటనకి, కార్యక్రమానికి ఉన్న సమయ నిష్పత్తి వంటివి చాలా హాయిగా అమలు పరచవచ్చు. నేను చెప్పిన ప్రతిపాదనలను యధాతథంగా అమలుపరచాలని నేనేమీ పట్టుపట్టడంలేదుకదా!! ఈ విషయాలను తయారు చెయ్యటానికి, సమాజంలోని పెద్దల, వినియోగదారుల సంఘాల సేవలను ఉపయోగించుకోవాలి అని చెప్పాను. దేనికైనా ఒక ప్రారంభం ఉండాలి. ప్రతివాళ్ళు ఆవతలివాళ్ళు చెప్పింది ప్రాక్టికల్ కాదు, ఇన్నోసెంటు, పెద్ద జోకు వంటి పదాలతో ఖండించి పారేస్తూ ఉంటే ప్రతిపాదనలు ఎలా వస్తాయి. ఒక అలోచన ప్రాక్టికల్ కాదు, అన్నప్పుడు ఎందుకు కాదో చెప్పాలి. ఊరికే నచ్చకపోతే ఆ అలోచనకు ఏదో పేరు పెట్టి ఎద్దేవా చేస్తే ఎలా.

    పూర్వం సినిమాలు తప్పనిసరిగా మూడు గంటలు ఉండేవి, ఇప్పుడు గంట, గంటన్నరకు వస్తున్నాయి. అంతటి సినిమాలే (తర తరాల కథలను) గంటన్నర నుంచి మూడు గంటలలో చూపించి (ఎన్నెన్నో రకరకాల కథలు, జీవిత చరిత్రల్తో సహా) మన్ని వినోదపరచగలిగినప్పుడు, టి.వి ధరావాహికలు ఎటువంటిదైనా సరే ఇన్ని వందల ఎపిసోడ్లలో ఉండాలా? ఈ ధారావాహికలు సాగ తీయటం వల్ల వాళ్ళు చూపించే గోప్ప కథల్లో ఏ ఒక్కటన్నా అద్భుతంగా మలచబడిందిదా? మనకు తెలుగులో ఈ చానెళ్ళన్ని వచ్చినాక ఒక్కటంటే ఒక్కటి సవ్యమైన ధారావాహిక వచ్చిందా? అన్నీ కూడ సాగతీతకు గురయ్యినవే. ధారావాహికల ఎపిసోడ్లను తప్పనిసరిగా కట్టడి చెయ్యాలి. దానివల్ల రచయితలు, నటులలో ఉన్న క్రియేటివిటీ బాగా బయటపడుతుంది. దూరదర్శన్ హయాంలో ఈ ఎపిసోడ్లను కట్టడి చెయ్యటం వల్లకదా చక్కటి ధారావాహికలు వచ్చి అందరినీ అలరించాయి. ఇప్పుడు తామర తంపరలాగ పుట్టిన చానెళ్ళు ఒక పధ్ధతి లెకుండా వాళ్ళ ధనార్జనే ముఖ్యంగా ప్రకటనలు చూపించటాని మాత్రమే ఈ ధారావాహికలను సాగ తీస్తున్నారు. పాడిందే పాడరా పాచిపళ్ళ దాసరిలాగ అదే కథ సంవత్సరాల పాటు చెప్పటం వల్ల, అటు నటనలోనే కాదు, ఇటు దర్శకత్వంలోనూ (అలాంటిది ఏమన్నా ఈ ధారావాహికలకు ఉన్నదా అని అని నా అనుమానం) రచనలోనూ కూడా దిగజారుడే కాని అభివృధ్ధి మాత్రం ఉండటంలేదన్న విషయంలో నాకేతే సందేహం లేదు.

    అమ్రత్య సేన్ పుస్తకం టైటిలు మాత్రమే నేను ఉదహరించాను. కోట్ చెయ్యలేదు. మన భారతీయులకు వాదించటంలో ఉన్న ప్రజ్ఞ, ఆవతలి వాళ్ళు చెప్పిన విషయాన్ని ఒప్పుకోకూడదన్న దీక్ష, ప్రతి విషయం "చర్చ" కాకుండా "వాదన" కే దారి తీసేట్టుచెయ్యటం వంటివి చూసినాకే ఆయన "ఆర్గ్యు మెంటేటివ్ ఇండియన్" అని తన పుస్తకానికి పేరుపెట్టి ఉంటాడని నా ఉద్దేశ్యం.

    Cost of Production గురించి ఇప్పటికే అనేక నిబంధనలు ప్రభుత్వం ఏర్పరిచింది. వాటిల్లో ప్రకటనల ఖర్చు ఈ పరిమితి మించి ఉండకూడదు అని ఉంచటం వల్ల వినియోగదారునికి ఉపయోగమే కాని నష్టం లేదు. అమలు పరచాలన్న నిజాయితీ ఉండాలేకాని, లక్ష మార్గాలు. ఒక్కసారి, మిఇనిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ ఎఫ్ఫైర్స్ వాళ్ళ్ అ వెబ్ సైటు చూడండి. http://www.mca.gov.in/Ministry/cab.html


    ఇటువంటి విషయం మీద అనేక మంది పాల్గొని సంపూర్ణ చర్చ జరగాలి కాని, మనమిద్దరమే వాదించుకుంటున్నాము. వినియోగదారుల్లోనే సరైన అవగాహన, విషయం మీద ఆసక్తి లేవు. అందుకనే ఈ ప్రకటనా మాఫియా రెచ్చిపోతున్నది, సమాజాన్ని తన మానసిక కాలుస్యంతో పట్టి పీడిస్తున్నది.

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.